Om అనగనగా ఒక తండ్రి.
రమేష్ బ్యాంకులో ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు. అతని భార్య పేరు జాహ్నవి. ఆమె ఒక పెద్ద కంపెనిలో ఉద్యోగం చేస్తుంది. వాళ్ళకు ఒక్కతే కూతుర ప్రియ. టెన్త్ క్లాస్ చచదువుతుంది. అనుకోకుండ ఒక ఉద్యమంలో రమేష్ కు గుండు తగిలి చనిపోతాడు. ఆ గుండు కాల్చింది సాగర్ అనే యస్ పి. సాగర్ తండ్రి ఈ విషయం తెలుసుకుని చాల బాధపడతాడు. జాహ్నవి ఇంటికి నౌకరుగా వెళతాడు. ఆమెను ఒప్పించి ఆ ఇంట్లో పనికి కుదురుతాడు. వాళ్ళకు అన్ని పనులు చేసి పెడతాడు. ప్రియకు చదువు చెప్తాడు. ముఖ్యంగా ఆమెకు లెక్కలలో ట్రయినింగ్ ఇస్తాడు. జాహ్నవిని రెండుసార్లు కాపాడతాడు. ఒక వైపు ప్రియకు చెప్పుతునే ఇంకో వైపు తన మనుమరాలు శృతికి కూడా పాఠాలు చెప్తాడు. ఇద్దరు పరీక్షలో మెరిట్ లో పాసవుతారు. ఇద్దరికి ఫెసిలిటేషన్ జరుగుతుంది. తమ విజయానికి కారణం తమ తాతయ్య అని ఇద్దరు చెప్తారు. ఇద్దరు రమణను స్టేజి మీదకు తీసుకువస్తారు. జాహ్నవికి ఏం అర్ధంకాదు. తరువాత రమణ అంతా చెప్తాడు.
Vis mer